kcr: ఊహించని అతిథి కేసీఆర్ ని చూసి పెళ్లి బృందం సంభ్రమాశ్చర్యాలు!

  • కరీంనగర్ జిల్లా పర్యటనలో ఆసక్తికర సంఘటన
  • తడికల్ గ్రామం మీదుగా వెళ్తుండగా పెళ్లి వేడుకను చూసిన సీఎం  
  • వెంటనే తన వాహనాన్ని ఆపించి.. అక్కడికి వెళ్లిన కేసీఆర్
  • అనుకోని అతిథిని చూసి ఆశ్చర్యపోయిన పెళ్లి బృదం

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఈరోజు ఉదయం రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. కేసీఆర్ తన పర్యటనలో భాగంగా శంకరపట్నం మండలంలోని తడికల్ గ్రామం మీదుగా వెళ్తుండగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. మార్గమధ్యంలో ఓ ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతోంది. కేసీఆర్ వెంటనే తన వాహనాన్ని ఆపించారు. ఆ వాహనంలో నుంచి దిగి నడచుకుంటూ నేరుగా పెళ్లి వేదిక వద్దకు వెళ్లారు.

 నూతన వధూవరులను ఆశీర్వదించి.. అభినందనలు తెలిపారు. ఈ ఊహించని సంఘటనతో పెళ్లి బృందం సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఊహించని అతిథిని చూసి చెప్పరాని సంతోషం వ్యక్తం చేశారు. కల్యాణలక్ష్మీ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామని పెళ్లి బృందానికి కేసీఆర్ హామీ కూడా ఇచ్చారు. కాగా, కేసీఆర్ వెంట మంత్రి ఈటల రాజేందర్, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

kcr
karimnagar
  • Loading...

More Telugu News