akash: అప్పుడే ఆకాశ్ ఇంతవాడయ్యాడా?: ప్రభాస్

  • ఆకాశ్ ను చూసి షాక్ అయ్యాను
  • నటన పరంగా మరింత ఆశ్చర్యపరిచాడు 
  • పూరి టేకింగ్ కొత్తగా అనిపించింది         

పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ హీరోగా 'మెహబూబా' సినిమా చేశాడు. ప్రపంచవ్యాప్తంగా రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ ప్రభాస్ మాట్లాడాడు. 'మెహబూబా' ట్రైలర్ లో ఆకాశ్ ను చూసి అప్పుడే ఇంతవాడయ్యాడా? అనుకున్నాను. ఎందుకంటే 'బుజ్జిగాడు' సినిమాలో నా చిన్నప్పటి పాత్రను ఆకాశ్ చేశాడు. అప్పటికీ .. ఇప్పటికీ పోల్చుకుని నేను షాక్ అయ్యాను""ఆకాశ్ హీరో కావడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. ఇక డైలాగ్ డెలివరీతోను .. నటనతోను ఆకాశ్ నన్ను మరింత ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావాలనీ .. ఆకాశ్ స్టార్ హీరో కావాలని కోరుకుంటున్నాను" అని ప్రభాస్ అన్నాడు. ''ఇక ఈ సినిమా టేకింగ్ విషయానికి వస్తే .. ఇది పూరి సినిమాలా అనిపించలేదు. పూరి ఎక్కువగా హీరోయిజం పైనే దృష్టిపెడతాడు. అలాంటిది ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే అందుకు పూర్తి భిన్నంగా కనిపించింది. పూరి ఇంతకుముందు చేసిన సినిమాలకంటే ఈ సినిమా కొత్తగా అనిపిస్తుంది" అని చెప్పుకొచ్చాడు.        

  • Loading...

More Telugu News