Telangana: ఎంతో ఉత్సాహపరిచే వాట్సప్ మెస్సేజ్ తో నా రోజు ప్రారంభమైంది: మంత్రి కేటీఆర్
- చిన్న కిరాణా వ్యాపారి ‘రైతుబంధు’కు విరాళ మిచ్చారు
- ఇంతకు మించి సంతోషకరమైన విషయమేముంటుంది!
- ఈ పథకానికి మరో ఇద్దరు వ్యక్తులు కూడా విరాళం ప్రకటించారు
దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకం ఈరోజు ప్రారంభమైంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకంలో తాను భాగస్వామిని అవుతానంటూ మంత్రి కేటీఆర్ కు ఒక వాట్సప్ మెసేజ్ వచ్చింది. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్వీట్ లో తెలిపారు.
‘ఎంతో ఉత్సాహపరిచే వాట్సప్ మెసేజ్ తో నా రోజు ప్రారంభమైంది. హైదరాబాద్ లోని ఉప్పల్ కు చెందిన ఒక చిన్న కిరాణా వ్యాపారి అనిల్ గారు (అతను పేర్కొన్నట్టుగా) ‘రైతుబంధు’ పథకానికి విరాళమిస్తానని చెప్పారు. ఇంతకు మించి సంతోషకరమైన విషయమేముంటుంది.. ధన్యవాదాలు. ఆయన అంగీకారంతో నెంబర్, మెస్సేజ్ ను ట్వీట్ చేస్తున్నాను. కృతఙ్ఞతలు అనిల్’ అని కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఈ పథకానికి తమ వంతు విరాళం ఇస్తామని ప్రకటించారని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.