nikesha patel: ప్రభుదేవాను పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ: హీరోయిన్ నికీషా పటేల్

  • ప్రభుదేవాకు, మా కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి
  • సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది
  • పడకగదికి రమ్మని బహిరంగంగానే అడుగుతారు

ప్రభుదేవాకు, తమ కుటుంబానికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని హీరోయిన్ నికీషా పటేల్ తెలిపింది. ప్రభుదేవాతో కలసి నటిస్తారా? అని తనను ఎంతో మంది అడుగుతున్నారని... ఆయనను పెళ్లి చేసుకోవడానికి కూడా తాను రెడీ అని చెప్పింది.

మరోవైపు, ప్రభుదేవాకు ఎప్పుడో పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల భార్యతో ఆయన విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్ నయనతారను ప్రేమించి, పెళ్లి చేసుకోవాలనుకున్నప్పటికీ... చివరి నిమిషంలో అది ఆగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా నికీషా పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరోవైపు, సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని తాను ఎప్పుడో చెప్పానని నికీషా తెలిపింది. అవకాశాలు కావాలంటే పడకగదికి రావాలంటూ కొందరు బహిరంగంగానే అడుగుతారని చెప్పింది. ఇది అన్ని రంగాల్లో జరుగుతున్నదే అయినప్పటికీ... సినీరంగం కాబట్టి ఎక్కువ ప్రచారం జరుగుతోందని తెలిపింది. 

nikesha patel
prabhu deva
marriage
Casting Couch
  • Loading...

More Telugu News