Sushmaswaraj: సుష్మా స్వరాజ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ, మోదీ, అమిత్ షాలపై విమర్శలు గుప్పించిన గల్లా జయదేవ్!

  • సుష్మా స్వరాజ్ చొరవతో గుంటూరులో పాస్ పోర్టు సేవా కేంద్రం
  • లేఖ రాయగానే స్పందించారన్న గల్లా జయదేవ్
  • సాయపడాలని కేంద్ర మంత్రులకు ఉన్నా అడ్డుపడుతున్న మోదీ, అమిత్ షా

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి, బీజేపీ మహిళా నేత సుష్మాస్వరాజ్ పై తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఉదయం గుంటూరులో రీజనల్ పాస్ పోర్టు సేవా కేంద్రం ప్రారంభం కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న గల్లా మాట్లాడుతూ, ఇక్కడి ప్రజల సౌకర్యార్థం ఓ పాస్ పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లేఖ రాయగానే ఆమె సానుకూలంగా స్పందించారని పొగిడారు.

 ఆమె చొరవతోనే ఇంత త్వరగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. పలువురు కేంద్ర మంత్రులకు ఆంధ్రప్రదేశ్ కు సాయం చేయాలని ఉందని, వారంతా సానుకూలంగా ఉన్నా, ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు అడ్డు పడుతున్నారని నిప్పులు చెరిగారు. వారి వైఖరితోనే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని అన్నారు. గతంలో పాస్ పోర్టు రావాలంటే నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉండేదని, ఇప్పుడు మాత్రం రోజుల్లోనే చేతికందుతోందని చెప్పారు.

Sushmaswaraj
Galla Jayadev
Amit sha
Narendra Modi
Guntur District
Andhra Pradesh
  • Loading...

More Telugu News