Pawan Kalyan: జన సైనికులు, అభిమానులతో ప్రతిజ్ఞ చేయించిన పవన్ కల్యాణ్!

  • సమైక్యతా ప్రతిజ్ఞ చేయించిన పవన్
  • ఎన్టీఆర్ స్టేడియంలో భారీ పతాకావిష్కరణ
  • భరతమాతకు 'జై' కొట్టించిన పవన్

ఈ ఉదయం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం, జనసేన అధినేత పవన్ కల్యాణ్, తన పార్టీ కార్యకర్తలు, అభిమానులతో సమైక్యతా ప్రతిజ్ఞ చేయించారు.

"భారతీయుడైన నేను, భారతదేశ పౌరుడిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. నా దేశ వారసత్వ సంపదను పరిరక్షిస్తూ, ప్రకృతికి నష్టం కలిగించకుండా, పర్యావరణాన్ని కాపాడుతూ, అనునిత్యం దేశ ప్రజల శ్రేయస్సుకై పరితపిస్తూ, దేశప్రజలందరి ఎడలా సహోదర భావం కలిగివుంటూ, ఎటువంటి కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలకు తావులేకుండా, దేశ ప్రయోజనాలే పరమావధిగా పాటిస్తూ, మన ఆడపడచుల పైన, మన అక్క చెల్లెళ్లపైనా, మన మహిళలపైనా పేగుబంధం కలిగి, వారిని సంరక్షించే బాధ్యత కలిగిన వాడిగా నడుచుకుంటానని, దేశ చట్టాలను గౌరవిస్తూ, దేశాభివృద్ధి కొరకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని, దేశ సాక్షిగా, జెండా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను" అని చెప్పించారు. ఆపై భరతమాతకు 'జై' కొట్టించారు.

Pawan Kalyan
Hyderabad
NTR Stadium
  • Loading...

More Telugu News