charan: చరణ్ తో కలిసి కేథరిన్ ఐటెం పాట!

  • చరణ్ తో బోయపాటి
  • కథానాయికగా కైరా అద్వాని 
  • త్వరలో ఐటమ్ సాంగ్ చిత్రీకరణ  

తెలుగు తెరపై అందాల కథానాయికగా కేథరిన్ మంచి మార్కులు కొట్టేసింది. ముఖ్యంగా ఆకర్షణీయమైన కళ్లతో యూత్ హృదయాలను దోచేసింది. 'సరైనోడు' సినిమాలో ఎమ్మెల్యే గా కనిపించి ఆకట్టుకున్న ఈ సుందరికి, తన తరువాత సినిమా అయిన 'జయ జానకి నాయక'లోను బోయపాటి ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో ఆమె చేసిన ఐటమ్ సాంగ్ కి మాస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

దాంతో ఇప్పుడు చరణ్ సినిమా కోసం కూడా ఆమెనే బోయపాటి ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. కైరా అద్వాని కథానాయికగా చేస్తోన్న ఈ సినిమాలో, చరణ్ తో కలిసి కేథరిన్ ఒక ఐటమ్ చేయనున్నట్టు తెలుస్తోంది. బ్యాంకాక్ షెడ్యూల్ తరువాత ఈ ఐటమ్ సాంగ్ ను చిత్రీకరిస్తారట. గతంలో చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' షూటింగు సమయంలో కొన్ని కారణాల వలన కేథరిన్ తప్పుకుంది. దాంతో ఇక ఆమెకి మెగా హీరోల సరసన ఛాన్స్ దొరకడం కష్టమేనని అనుకున్నారు. అలాంటి అనుమానాలకు బోయపాటి తెరదించేశాడనే చెప్పాలి.  

charan
kiara advani
  • Loading...

More Telugu News