Revanth Reddy: కాంగ్రెస్ కే నష్టమంటూ రేవంత్ చెప్పడం సరికాదు: పొంగులేటి

  • సీఎం పదవి గురించి మాట్లాడేందుకు ఇది సమయం కాదు
  • రేవంత్ కు రాహుల్ ఎలాంటి హామీ ఇవ్వలేదు
  • కాంగ్రెస్ విధానాలను రేవంత్ మొదట అర్థం చేసుకోవాలి

ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విషయమని తెలంగాణ శాసనమండలి కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్పారు. పార్టీలోకి వచ్చిన నాలుగు రోజులకే రేవంత్ ఈ స్థాయిలో మాట్లాడటం మంచిది కాదని అన్నారు. సీఎం పదవి గురించి మాట్లాడే సమయం ఇది కాదని చెప్పారు. తనను సరిగ్గా వాడుకోకపోతే కాంగ్రెస్ కే నష్టమని రేవంత్ వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. పీసీసీపై విమర్శలు గుప్పించడం మంచిది కాదని, కాంగ్రెస్ ను తానే నడిపిస్తున్నట్టు వ్యాఖ్యానించడం అభ్యంతరకరమని చెప్పారు.

రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఎలాంటి హామీ ఇవ్వలేదని పొంగులేటి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వ్యవస్థ అని, వ్యక్తులతో పార్టీ నడవదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పద్ధతులను రేవంత్ మొదట అర్థం చేసుకోవాలని సూచించారు. పార్టీలో తనంత సీనియర్ ఎవరూ లేరని, అయినా పదవులు వచ్చినా, రాకపోయినా తాను పని చేస్తూనే ఉంటానని చెప్పారు. రేవంత్ కు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పార్టీ వేదికపైనే మాట్లాడాలని... పార్టీకి నష్టం కలిగించే రీతిలో బహిరంగ విమర్శలు చేయడం తగదని అన్నారు. 

Revanth Reddy
ponguleti sudhakar reddy
Rahul Gandhi
pcc
  • Loading...

More Telugu News