Revanth Reddy: సీనియర్లను అవమానించేలా రేవంత్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు: కోమటిరెడ్డి

  • ముఖ్యమంత్రి కావడమే లక్ష్యమంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు సరికావు
  • కాంగ్రెస్ ను బంగారం చేసే సత్తా ఉన్నప్పుడు.. టీడీపీనే బంగారం చేసి ఉండాల్సింది
  • తమకు దీక్ష చేయాలని రేవంత్ చెప్పారనడం విడ్డూరంగా ఉంది

తెలంగాణకు ముఖ్యమంత్రి కావడమే తన లక్ష్యమంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పుబట్టారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలోని సీనియర్లను కించపరిచేలా ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీని బంగారం చేస్తానన్న రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... అంత సత్తా ఉంటే టీడీపీనే బంగారం చేసి ఉండాల్సిందని చెప్పారు.

ప్రజాసమస్యలపై తాను ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నానని... తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం కాదనుకుని నిరవధిక దీక్షకు దిగానని, నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్యపై దీక్ష చేపట్టానని చెప్పారు. తమ అసెంబ్లీ సభ్యత్వంపై వేటు పడిన నేపథ్యంలో, గాంధీభవన్ లో రెండు రోజుల దీక్ష చేపట్టడమనేది ఎమ్మెల్యే సంపత్ తో కలసి తాను తీసుకున్న నిర్ణయమని తెలిపారు. తనకు దీక్ష చేయాలని రేవంత్ చెప్పారనడం విడ్డూరంగా ఉందని చెప్పారు. 

Revanth Reddy
komatireddy venkatreddy
sampath
  • Loading...

More Telugu News