keerti suresh: 'మహానటి' శాటిలైట్ రైట్స్ 10 కోట్లు!

- నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'మహానటి'
- ప్రాజెక్టు ఆరంభంలో అంతగా లేని క్రేజ్
- తెలివిగా అంచనాలు పెంచేసిన నాగ్ అశ్విన్
నాగ్ అశ్విన్ .. సావిత్రి బయోపిక్ గా 'మహానటి' ప్రాజెక్టును మొదలుపెట్టినప్పుడు అంతగా ఎవరూ పట్టించుకోలేదు. దర్శకుడిగా నాగ్ అశ్విన్ కి పెద్దగా క్రేజ్ లేకపోవడం, సావిత్రి జీవితచరిత్రలో విషాదమే హైలైట్ కావడం అందుకు కారణం. అందువలన ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి లేదు .. అంచనాలు లేవు. ఈ కారణంగా శాటిలైట్ రైట్స్ కోసం కూడా ఎవరూ ముందుకు రాలేదు.
