Sourav Ganguly: అంబటి రాయుడిని తీసుకోవడంపై గంగూలీ ఆశ్చర్యం!

  • తదుపరి సిరీస్ కు ఎంపికైన అంబటి రాయుడు
  • అతని స్థానంలో అజింక్య రహానేను తీసుకోవాల్సింది
  • ఇంగ్లండ్ లో రహానే గతంలో రాణించాడన్న గంగూలీ

త్వరలో జరిగే ఇంగ్లండ్, ఐర్లండ్ క్రికెట్ సిరీస్ కు అంబటి రాయుడిని ఎంపిక చేయడంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. తానైతే రాయుడిని పక్కనబెట్టి అజింక్య రహానేను ఎంపిక చేసుండేవాడినని అన్నాడు. ఇంగ్లండ్ లో బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుందని వ్యాఖ్యానించిన గంగూలీ, మిడిల్ ఆర్డర్ లో రహానే లేని లోటు తనకు ఇప్పుడే కనిపిస్తోందని అన్నాడు.

ఇంగ్లండ్ లో గతంలో పర్యటించిన రహానే ఎంతో చక్కగా రాణించాడని గుర్తు చేశాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో రాయుడు రాణిస్తున్నప్పటికీ, ఇటీవలి అతని వన్డే రికార్డు సరిగ్గా లేదని చెప్పాడు. గత 6 మ్యాచ్ లలో కేవలం 140 పరుగులే చేశాడని వెల్లడించాడు. రహానే గడచిన ఏడాదిలో 17 వన్డేల్లో 725 పరుగులు చేశాడని చెప్పాడు. కాగా, పొట్టి క్రికెట్ లో రాణిస్తున్న రాయుడు, 50 ఓవర్ల మ్యాచ్ కి వచ్చేసరికి ఏ మాత్రం రాణించలేక పోతున్న సంగతి తెలిసిందే.

Sourav Ganguly
Ajinkya Rahane
Ambati Rayudu
  • Loading...

More Telugu News