Maganti Babu: అందువల్లే ప్రాణాలతో బతికి బయటపడ్డాను: ఏలూరు ఎంపీ మాగంటి బాబు

  • టెలీ మెడిసిన్ ద్వారా సిబ్బంది సలహాలు తీసుకున్నారు
  • అంబులెన్స్ లో ప్రథమ చికిత్స వల్లే ప్రాణాలు దక్కాయి 
  • నేడు డిశ్చార్జ్ అవుతున్నానన్న మాగంటి బాబు

తనకు గుండెపోటు వచ్చిన సమయంలో డాక్టర్లు ఎవరూ అందుబాటులో లేరని, ప్రాణాలు కాపాడాల్సిన ఆ గోల్డెన్ అవర్ లో టెలీ మెడిసిన్ తనను బతికించిందని, అందువల్లే ప్రాణాలను కాపాడుకోగలిగానని ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) వ్యాఖ్యానించారు. గత శుక్రవారం ఆయనకు గుండెపోటురాగా, తొలుత ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.

నేడు మాగంటి బాబును డిశ్చార్జ్ చేయనుండగా, ఇదే విషయాన్ని తనను కలిసిన విలేకరులకు ఆయన చెప్పారు. అంబులెన్స్ లోనే వైద్యుల సలహా మేరకు ఈసీజీ నిర్వహించి, చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబుకు సెల్ ఫోన్ ద్వారా రిపోర్టుల గురించి చెప్పారని, ఆయన సలహాలు, సూచనలను అంబులెన్స్ సిబ్బంది పాటిస్తూ, ఫస్ట్ ఎయిడ్ అందించడం వల్లే సురక్షితంగా విజయవాడకు చేరుకున్నానని తెలిపారు.

Maganti Babu
Elur MP
Vijayawada
Heart Attack
  • Loading...

More Telugu News