Telangana: తెలంగాణ టీడీపీకి మరో షాక్.. రేపు కాంగ్రెస్‌లో చేరనున్న వంటేరు!

  • టీడీపీ నుంచి మరో నేత జంప్
  • రేపు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి వంటేరు
  • వెంట వెళ్లనున్న ఉత్తమ్, షబ్బీర్

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ముఖ్యనేతలు వలస బాట పట్టగా ఉన్న ఒకరిద్దరు ముఖ్య నేతలు కూడా పక్క చూపులు చూస్తున్నారు. తెలంగాణలో టీడీపీకి బలమైన నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆయనతో పాటు మరికొందరు నడిచారు.

తాజాగా మరో నేత వంటేరు ప్రతాప్ రెడ్డి రేపు (శుక్రవారం) అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ కూడా ఆయన వెంట ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం.

Telangana
Telugudesam
Congress
Vanteru pratap reddy
  • Loading...

More Telugu News