Lok Sabha: లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలపై ఈ నెల 16న కీలక చర్చలు

  • సమావేశం కానున్న ఈసీ‌, న్యాయ కమిషన్‌ 
  • ఇటీవలే జమిలి ఎన్నికలపై న్యాయ కమిషన్‌ వర్కింగ్‌ పేపర్‌
  • రాజ్యాంగంలోని రెండు అధికరణలకు సవరణ చేయాలని సూచన

ఈ నెల 16వ తేదీన ఎన్నికల కమిషన్‌, న్యాయకమిషన్‌ సమావేశమై దేశంలో జమిలి ఎన్నికల విషయంపై చర్చించనున్నాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే సమయం, వ్యయం ఆదా అవుతాయని చాలామంది భావిస్తోన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ఈసీ కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపై చర్చించేందుకు న్యాయ సంఘం చైర్మన్ జస్టిస్‌ బీఎస్‌ చౌహన్‌, ఇతర అధికారులకు ఎన్నికల కమిషన్‌ ఆహ్వానం పంపింది.

ఇటీవలే జమిలి ఎన్నికలపై న్యాయ కమిషన్‌ వర్కింగ్‌ పేపర్‌ను కూడా జారీ చేసి, రాజ్యాంగంలోని కనీసం రెండు అధికరణలను సవరిస్తే సరిపోతుందని తెలిపింది. ఇలా ఏర్పాటైన ప్రభుత్వం మధ్యలోనే కూలిపోతే, మిగతా కాలానికి మాత్రమే కొత్త సర్కారుని ఎన్నుకోవాలని, మళ్లీ ఐదేళ్ల పాటు కొనసాగించవద్దని పేర్కొంది. ఈ నెల 16న నిర్వహించనున్న సమావేశంలో ఈ అంశాలన్నింటిపై సమగ్రంగా చర్చించనున్నారు. 

  • Loading...

More Telugu News