vijay devarakonda: వినూత్న రీతిలో బర్త్ డే జరుపుకున్న విజయ్ దేవరకొండ!

  • నా బర్త్ డే సందర్భంగా ఐస్ క్రీమ్ ట్రక్స్ ను సిటీ మొత్తం తిప్పుతా
  • ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు.. ఐస్ క్రీమ్స్ ఇస్తా
  • ఓ ట్వీట్ చేసిన విజయ్ దేవరకొండ

సాధారణంగా బర్త్ డే వేడుక అంటే.. ఏదైనా రెస్టారెంట్, ఫంక్షన్ హాల్, రిసార్ట్స్ లోనో తన మిత్రులకు, సన్నిహితులకు ఓ గ్రాండ్ పార్టీ అరేంజ్ చేసి ఎంజాయ్ చేస్తుంటారు. కానీ, యువ నటుడు విజయ్ దేవరకొండ మాత్రం తన 29వ బర్త్ డేను వినూత్న రీతిలో ఈరోజు జరుపుకున్నాడు. కేవలం తనకు కావాల్సిన వారికే కాకుండా హైదరాబాద్ సిటీ ప్రజలకు పార్టీ ఇచ్చాడని చెప్పొచ్చు.

ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ తన ట్వీట్ లో ప్రస్తావించాడు. కొన్ని రోజుల పాటు ఎండలో షూటింగ్ చేసిన కారణంగానే తనకు ఈ ఆలోచన  వచ్చిందని, మూడు ఐస్ క్రీమ్ ట్రక్స్ ను సిటీ మొత్తం తిప్పుతూ.. పనుల నిమిత్తం ఎండలో బయట తిరిగే ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఐస్ క్రీమ్ ఇస్తే బాగుంటుందని.. ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు, ఉద్యోగస్తులకు ఐస్ క్రీమ్స్ ఇవ్వాలని భావించానని తన ట్వీట్ లో చెప్పాడు.

కాగా, ఐస్ క్రీమ్ ట్రక్స్ పై  ‘ది దేవరకొండ బర్త్ డే ట్రక్’ అని రాసి ఉన్నాయి. ఆ ట్రక్స్ పై  విజయ్ దేవరకొండ ఫొటోలు కూడా ఉన్నాయి. కాగా, ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవర కొండ మాట్లాడుతూ, సాధారణంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడమంటే తనకు అసహ్యమని చెప్పాడు. తన పుట్టినరోజు వేడునకు తానెప్పుడూ జరుపుకోలేదని అన్నాడు. ‘నేను చేసే పనులపై ఆసక్తి చూపడాన్ని ఇష్టపడతా. ఒక మంచి సినిమాలో నటించడం, లేకపోతే నటనను మెచ్చుకోవడం వంటివి... ఇలా ఐస్ క్రీమ్ పంచడంలో ఎంతో కొంత అర్థముందని భావిస్తా’ అని చెప్పుకొచ్చాడు.

vijay devarakonda
birth day
  • Error fetching data: Network response was not ok

More Telugu News