KCR: తెలంగాణ వ్యాప్తంగా రేపు 'రైతు బంధు' పథకం ప్రారంభం.. ఎకరాకు రూ.4 వేల పెట్టుబడి సాయం

  • హుజురాబాద్‌లో ప్రారంభించనున్న కేసీఆర్‌
  • పలు జిల్లాల్లో మంత్రుల చేతుల మీదుగా ప్రారంభం
  • చెక్కులపై లబ్దిదారుల పేరు, పాస్‌బుక్ యూనిక్ ఐడీ

తెలంగాణ వ్యాప్తంగా రేపు రైతు బంధు పథకం ప్రారంభం కానుంది. ఈ పథకం కింద ఎకరాకు రూ.4 వేలు పెట్టుబడి సాయంగా ఇవ్వనున్నారు. ప్రభుత్వం అందించే ఈ చెక్కులపై లబ్దిదారుల పేరు, పాస్‌బుక్ యూనిక్ ఐడీ, రైతు గ్రామం, మండలం, జిల్లాల పేర్లు ఉంటాయి. కరీంనగర్‌లోని హుజురాబాద్‌లో లక్షమంది రైతుల సమక్షంలో ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. మరోవైపు ఉద‌యం 11.15 గంట‌ల‌కు అన్ని జిల్లాల్లో మంత్రులు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

తెలంగాణ వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, వ‌న‌ప‌ర్తి జిల్లాల్లో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి రైతుల‌కు పాసు పుస్త‌కాల‌తోపాటు చెక్కులు పంపిణీ చేయ‌నున్నారు. మంత్రి ల‌క్ష్మారెడ్డితోపాటు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి పోచారం శ్రీ‌నివాస‌రెడ్డి కూడా పాల్గొంటారు.

ఉదయం 11 గంట‌ల‌కు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా మ‌క్త‌ల్ మండ‌లం కాట్రేవ్‌ప‌ల్లిలో రైతాంగానికి రైతు బంధు ప‌థ‌కం పాసు పుస్త‌కాలు-చెక్కుల పంపిణీ చేస్తారు. అనంతరం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వ‌న‌ప‌ర్తి జిల్లా కొత్త‌కోట మండ‌లం క‌నిమెట్టలో రైతాంగానికి రైతు బంధు ప‌థ‌కం పాసు పుస్త‌కాలు-చెక్కుల పంపిణీ చేస్తారు. ఈ కార్య‌క్ర‌మాల్లో ఆయా జిల్లాల‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, రైతులు, ప్ర‌జ‌లు పాల్గొంటారు. 

  • Loading...

More Telugu News