kedarnath: కేదార్ నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత!

  • నిరంతరాయంగా కురుస్తున్న మంచు.. ప్రతికూల వాతావరణం
  • కేదార్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు
  • వాతావరణం అనుకూలించే వరకు వెళ్లొద్దని యాత్రికులకు హెచ్చరిక

నిరంతరాయంగా కురుస్తున్న మంచు, ప్రతికూల వాతావరణం కారణంగా కేదార్ నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. లించౌలి, భీంబలి ద్వారా కేదార్ నాథ్ వెళ్లేందుకు యాత్రికులను అధికారులు అనుమతించడం లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు యాత్రికులెవ్వరూ కేదార్ నాథ్ కు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

కాగా, కేదార్ లో మూడు అంగుళాల మేరకు మంచు కురుస్తోంది. సోన్ ప్రయాగ, గౌరీకుండ్, భీమ్ బలిసుమారు 2,200 మంది యాత్రికులు ఆగిపోయారు. అక్కడి హోటల్స్, గెస్ట్ హౌస్ లలో యాత్రికులు ఉండిపోయారు. ఉత్తరాఖండ్ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి లలో ఆరు అంగుళాల మేరకు మంచు కురిసినట్టు సమాచారం. గడచిన ఎనిమిది సంవత్సరాలలో ఇంతగా మంచు కురవడం ఇదే తొలిసారని ఆయా ఆలయాల అర్చకులు తెలిపారు. అయితే, కేదార్ నాథ్ లా కాకుండా, ఇక్కడికి వచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది లేదని, ప్రయాణం సజావుగానే సాగుతోందని చెప్పారు.

  • Loading...

More Telugu News