job: జాబ్‌మేళా నిర్వహిస్తున్న ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ.. 25 కంపెనీల ఇంటర్వ్యూలు

  • ఈ నెల 15వ తేదీన ఇబ్రహీంపట్నంలో జాబ్‌మేళా
  • 18 నుంచి 30 ఏళ్లలోపున్న యువతీయువకులు అర్హులు
  • http://jobskills.apssdc.in/sdc లో రిజిస్ట్రేషన్లు
  • అభ్యర్థులకు సూచనలు

ఆంధ్రప్రదేశ్‌ జల వనరులశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన ఇబ్రహీంపట్నంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఎపీఎస్‌ఎస్‌డీసీ) కృష్ణా జిల్లా మేనేజర్ ప్రణయ్ ఓ ప్రకటనలో తెలిపారు. నిమ్రా ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే జాబ్ మేళాకు 25 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, బీఫార్మసి, ఎంఫార్మసీ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన 18 నుంచి 30 ఏళ్లలోపున్న యువతీయువకులు తమ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావచ్చని ఆయన తెలిపారు.

జాబ్ మేళాకు హాజరు కావాలనుకునే యువతీయువకులు తమ వివరాలను http://jobskills.apssdc.in/sdc లో నమోదు చేసుకోవాలి. అనంతరం అభ్యర్థులు తమ మెయిల్ కు వచ్చిన హాల్ టికెట్ ను తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కొరకు టోల్ ఫ్రీ నంబర్లు 18004252422, 9700092606 ను సంప్రదించవచ్చు. ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కృష్ణా జిల్లా మేనేజర్ ప్రణయ్ కోరారు.

  • Loading...

More Telugu News