keerthi suresh: సావిత్రి బయోపిక్ తీయడానికి ఆ పుస్తకమే ప్రేరణ: దర్శకుడు నాగ్ అశ్విన్

  • సావిత్రి ఎంతోమంది ప్రముఖులను కలిశారు 
  • ఆమె అప్పట్లోనే కారు చాలా బాగా నడిపేవారు 
  • ఆమె ధైర్యం నన్నెంతగానో ఆకట్టుకుంది    

వ్యక్తిగత జీవితంలోను .. వృత్తిపరమైన జీవితంలోను సావిత్రి ఎన్నో ఒడిదుడుకులను చూశారు. తాను ఎలాంటి పరిస్థితుల్లో వున్నా .. తనకి చేతనైనంత సాయం చేశారు. అలాంటి సావిత్రి జీవితచరిత్రగా రూపొందిన 'మహానటి' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడారు.

" సహజంగానే నేను బుక్స్ ఎక్కువగా చదువుతూ వుంటాను .. అలాగే సావిత్రి గారి గురించి రాసిన ఒక పుస్తకం చదివాను. నెహ్రు .. ఇందిరాగాంధీ వంటి ప్రముఖలను ఆమె కలిసిన ఫోటోలను చూశాను. ప్రొఫెషనల్స్ నడిపినట్టుగా ఆమె కారు చాలా బాగా నడిపేవారట. ఆ రోజుల్లో స్త్రీలు కారు నడపడమనేది చాలా అరుదు. అలాంటిది కారు రేసుల్లోను సావిత్రి పాల్గొనేవారంటే, ఆమెకి గల నైపుణ్యం .. ధైర్యం ఎంతటివో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఆ పుస్తకంలోని విషయాలే ఆమె బయోపిక్ ను తీయాలనే ఆలోచనను కలిగించాయి" అంటూ చెప్పుకొచ్చారు.     

keerthi suresh
vijay devarakonda
  • Loading...

More Telugu News