raviteja: రవితేజతో రెండు సినిమాలు .. పారితోషికంగా 16 కోట్లు?

- 'నేల టిక్కెట్టు'తో పలకరించనున్న రవితేజ
- ప్రస్తుతం శ్రీను వైట్ల మూవీతో సెట్స్ పైన
- తదుపరి ప్రాజెక్టు సంతోష్ శ్రీనివాస్ తో
రవితేజ తాజా చిత్రంగా 'నేల టిక్కెట్టు' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథాకథనాలతో ఈ సినిమా రూపొందినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమా తరువాత శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో ఆయన మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడని అంటున్నారు.
