nagam janardhan reddy: కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డికి మాతృవియోగం

  • నాగం తల్లి నారాయణమ్మ (95) మృతి
  • పంజాగుట్ట నిమ్స్ లో చికిత్స పొందుతూ ఈరోజు మృతి
  • ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు
  • రాజకీయ ప్రముఖుల సంతాపం

టీ - కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి తల్లి నారాయణమ్మ (95) మృతి చెందారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని పంజాగుట్ట నిమ్స్ లో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచినట్టు నారాయణమ్మ కుటుంబసభ్యులు తెలిపారు. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో ఈరోజు సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు సమాచారం. కాగా, నాగం తండ్రి వెంకట్ రెడ్డి గతంలోనే మృతి చెందారు. వెంకట్ రెడ్డి-నారాయణమ్మకు ముగ్గురు కొడుకులు, కుమార్తెలు ఉన్నారు. నాగం జనార్దన్ రెడ్డి తల్లి మృతిపై రాజకీయ నాయకులు పలువురు సంతాపం తెలిపారు.

nagam janardhan reddy
narayannama
  • Loading...

More Telugu News