modi: మోదీ అలా మాట్లాడితే ఎలా?: మంత్రి యనమల

  • రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా విషయమై ద్వంద్వ వైఖరి
  • సీఎంగా ఉన్నప్పుడు ఒకలా, పీఎం అయ్యాక మరోలా మాటలు
  • పన్నుల వాటాను 47 శాతానికి కుదించారు

రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా విషయమై నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఒకలా, ప్రధాని అయ్యాక మరోలా మాట్లాడుతున్నారని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా 50 శాతం ఉండాలని డిమాండ్ చేశారని, ఆయన ప్రధాని అయ్యాక ఆ వాటాను 47 శాతానికి కుదించారని, ఇప్పుడేమో ఆ వాటాను ఇంకా తగ్గించాలని చూస్తున్నారని విమర్శించారు. మోదీ సీఎంగా ఉన్నప్పుడు ఒక మాట, ప్రధాని అయిన తర్వాత మరోమాట మాట్లాడితే ఎలా అని యనమల ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News