keerti suresh: సావిత్రిగా కీర్తి సురేశ్ పలికించిన హావభావాలు అద్భుతం!

- 'మహానటి'లో సావిత్రి కనిపించింది
- కీర్తి సురేశ్ కెరియర్లో గొప్ప సినిమా
- ఆమెకి నూటికి నూరు మార్కులు
తెలుగు తెరపై విభిన్నమైన పాత్రలను పోషిస్తూ .. విలక్షణమైన నటనతో మెప్పించిన కథానాయికలు ఎంతోమంది వున్నారు. అలాంటి కథానాయికలలో ఒక్క సావిత్రి మాత్రమే 'మహానటి' అనిపించుకున్నారు. ఆమె జీవితచరిత్రగా రూపొందిన 'మహానటి' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె పాత్రలో కీర్తి సురేశ్ నటించింది. నవరసాలను అవలీలగా పలికించే సావిత్రి పాత్ర కోసం కీర్తి సురేశ్ ను ఎంపిక చేసుకున్నప్పుడు చాలామంది నొసలు చిట్లించారు.
