Chandrababu: చంద్రబాబును చంపేందుకు కుట్ర జరుగుతోంది: ఎస్వీ మోహన్ రెడ్డి, మణిగాంధీ

  • ఓటుకు నోటు కేసుతో చంద్రబాబుకు సంబంధం లేదు
  • బాబుపై ఈగ వాలినా రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నందుకే కుట్రలు

టీడీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, మణిగాంధీలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును హతమార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని వారు తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటుకు నోటు కేసుతో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని... అయినా ఆయనను ఇరికించేందుకు కుట్రలు జరగుతున్నాయని అన్నారు. చంద్రబాబుపై ఈగ వాలినా ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండమవుతుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నిలదీస్తున్నందుకే కొందరు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎదుర్కొనే సత్తా చంద్రబాబుకు ఉందని అన్నారు.

Chandrababu
vote for note
sv mohan reddy
mani gandhi
murder
plan
  • Loading...

More Telugu News