cherukupalli srinivas reddy: టీఆర్ఎస్ లో చేరనున్న వైయస్ సన్నిహితుడు!

  • కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరుతున్న చెరుకుపల్లి శ్రీనివాస్ రెడ్డి
  • పలు బాధ్యతలను నిర్వర్తించిన చెరుకుపల్లి
  • వైయస్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు

వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత చెరుకుపల్లి శ్రీనివాస్ రెడ్డి నేడు టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో వారు గులాబీ కండువా కప్పుకోనున్నారు.

సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ లో ఉన్న చెరుకుపల్లి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. మునిసిపల్ ఛైర్మన్ గా, 'కుడా' ఛైర్మన్ గా బాధ్యతలను నిర్వర్తించారు. దివంగత రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెరుకుపల్లికి పేరుంది. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చొరవతో ఆయన టీఆర్ఎస్ లో చేరుతున్నారు. 

cherukupalli srinivas reddy
KTR
TRS
Congress
ys rajasekhara reddy
  • Loading...

More Telugu News