keerthi suresh: 'జగదేకవీరుడు' విడుదలైన రోజునే 'మహానటి' విడుదల కావడం విశేషం!: రాఘవేంద్రరావు

- ఆ రోజుల్లో ఆ సినిమా ఓ సంచలనం
- మళ్లీ ధైర్యం చేసిన అశ్వనీదత్
- కీర్తి .. దుల్కర్ నటన అద్భుతం
రాఘవేంద్రరావు కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'జగదేకవీరుడు అతిలోక సుందరి' ఒకటి. 28 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఆ సినిమా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. అదే బ్యానర్ నుంచి ఇదే రోజున 'మహానటి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని గురించి రాఘవేంద్రరావు ట్విట్టర్ ద్వారా స్పందించారు.

మా దత్తు (అశ్వనీదత్) గారికి ఆ రోజున ఎంత ఆనందం వేసిందో మరిచిపోలేను. ఆ సినిమా విడుదలైన రోజునే 'మహానటి' విడుదల కావడం విశేషం. అప్పట్లో 'జగదేకవీరుడు అతిలోక సుందరి' నిర్మించడానికి ఎంత ధైర్యం కావాలో .. ఇప్పుడు 'మహానటి' నిర్మాణానికి అంతే ధైర్యం కావాలి. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శక నిర్మాతలకు .. ప్రధానమైన పాత్రలను పోషించిన కీర్తి సురేశ్ .. దుల్కర్ సల్మాన్ లకు .. చిత్ర యూనిట్ కి అభినందనలు" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.