keerthi suresh: 'జగదేకవీరుడు' విడుదలైన రోజునే 'మహానటి' విడుదల కావడం విశేషం!: రాఘవేంద్రరావు

  • ఆ రోజుల్లో ఆ సినిమా ఓ సంచలనం 
  • మళ్లీ ధైర్యం చేసిన అశ్వనీదత్ 
  • కీర్తి .. దుల్కర్ నటన అద్భుతం

రాఘవేంద్రరావు కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'జగదేకవీరుడు అతిలోక సుందరి' ఒకటి. 28 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఆ సినిమా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. అదే బ్యానర్ నుంచి ఇదే రోజున 'మహానటి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని గురించి రాఘవేంద్రరావు ట్విట్టర్ ద్వారా స్పందించారు." 28 సంవత్సరాల క్రితం ఇదే రోజున భారీ వర్షం. చాలా పెద్ద సినిమా తీశాము అనే ఆనందం .. ఎలా ఆడుతుందోననే భయం. ఎప్పుడు వరద ఆగుతుందా అని ఎదురుచూపు. ఎట్టకేలకు సాయంత్రం నుంచి జనాలు థియేటర్ల వైపు కదిలారు. మరుసటి రోజు నుంచి అభిమానుల రూపంలో థియేటర్లకు వరద రావడం మొదలైంది.

మా దత్తు (అశ్వనీదత్) గారికి ఆ రోజున ఎంత ఆనందం వేసిందో మరిచిపోలేను. ఆ సినిమా విడుదలైన రోజునే 'మహానటి' విడుదల కావడం విశేషం. అప్పట్లో 'జగదేకవీరుడు అతిలోక సుందరి' నిర్మించడానికి ఎంత ధైర్యం కావాలో .. ఇప్పుడు 'మహానటి' నిర్మాణానికి అంతే ధైర్యం కావాలి. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శక నిర్మాతలకు .. ప్రధానమైన పాత్రలను పోషించిన కీర్తి సురేశ్ .. దుల్కర్ సల్మాన్ లకు .. చిత్ర యూనిట్ కి అభినందనలు" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.  

  • Loading...

More Telugu News