charan: రీ షూట్ పెట్టమని బోయపాటితో చెప్పిన చరణ్?

  • బోయపాటి దర్శకత్వంలో చరణ్ 
  • కథానాయికగా కైరా అద్వాని 
  • తదుపరి షెడ్యూల్ బ్యాంకాక్ లో    

చరణ్ హీరోగా బోయపాటి ఒక సినిమా చేస్తున్నాడు. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఇటీవలే చరణ్ .. కైరా అద్వాని .. స్నేహ .. తమిళ సీనియర్ హీరో ప్రశాంత్ కాంబినేషన్లో బోయపాటి కొన్ని సీన్స్ ను షూట్ చేశారు. ఆ సన్నివేశాలను చిత్రీకరించిన తీరు చరణ్ కి సంతృప్తికరంగా అనిపించలేదట. దాంతో ఆ ఆర్టిస్టుల డేట్స్ మళ్లీ తీసుకుని .. రీ షూట్ పెట్టమని బోయపాటికి చరణ్ చెప్పాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను బ్యాంకాక్ లో ప్లాన్ చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఓ 15 రోజుల పాటు అక్కడ షూటింగ్ జరపనున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక .. చరణ్ చెప్పిన సీన్స్ రీ షూట్ పెట్టుకుంటారట. వివేక్ ఒబెరాయ్ విలన్ గా చేస్తోన్న ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేయనున్నారు.    

  • Error fetching data: Network response was not ok

More Telugu News