Narendra Modi: రాహుల్ ది అహంకారం... ప్రధాని అవుతానని ఎవరైనా ఎలా ప్రకటించుకుంటారు?: మోదీ

  • రాహుల్ ప్రకటనపై మోదీ తీవ్ర విమర్శలు 
  • సీనియర్లు ఎంతో మంది ఆ పార్టీలో ఉన్నారు
  • ఈ ఎన్నికలు కర్ణాటక భవిష్యత్తును నిర్ణయించేవి

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే ప్రధాని పగ్గాలు చేపట్టేందుకు తాను సిద్ధమేనంటూ ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ విమర్శలు కురిపించారు. కర్ణాటకలోని బంగారపేటలో ప్రజలను ఉద్దేశించి ఈ రోజు మోదీ ప్రసంగించారు. రాహుల్ గాంధీ పేరును నేరుగా ప్రస్తావించకుండానే విమర్శించారు. తాను ప్రధాని కాబోతున్నానని నిన్న ఒకరు కీలకమైన ప్రకటన చేశారని గుర్తు చేసిన ఆయన, ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న సీనియర్లు ఉంటే వారందరినీ తోసుకుని ఆయన (రాహుల్) బలంగా వస్తున్నారని పేర్కొన్నారు.

‘‘ఎవరైనా తాను ప్రధానిని అవుతానని ఎలా ప్రకటించుకుంటారు? ఇది కేవలం అహంకారమే’’ అని మోదీ పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికలు గెలుపోటములకే పరిమితం కాదని, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవిగా ఆయన పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వంలో ఒక ప్రధాని ఉంటే, ఆయనకు సంబంధించి ఒక రిమోట్ కంట్రోల్ ఉండేదని... ఎన్డీయే ప్రభుత్వంలో తమ రిమోట్ కంట్రోల్ 125 కోట్ల ప్రజలేనని మోదీ అన్నారు.

  • Loading...

More Telugu News