keerthi suresh: మనసును కదిలిస్తోన్న 'మహానటి'.. ప్రీమియర్ షో టాక్

  • సావిత్రిగా కీర్తి సురేశ్ నటన అద్భుతం 
  • దుల్కర్ తో ఆమె జోడీ బాగా కుదిరింది 
  • సమంత .. చైతూ పాత్రలు ప్రత్యేక ఆకర్షణ

తెలుగు చిత్రపరిశ్రమకి ఎన్టీఆర్ .. ఏఎన్నార్ రెండు కళ్లు అయితే, నుదుటున దిద్దిన తిలకం సావిత్రి అని చెప్పొచ్చు. ఈ ఇద్దరితోపాటు ఎస్వీఆర్ తోను సరితూగ గల నటనను ప్రదర్శించి ఆమె శభాష్ అనిపించుకున్నారు. అలాంటి సావిత్రి జీవితచరిత్రగా తెరకెక్కిన 'మహానటి' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రీమియర్ షోస్ కి యూఎస్ లో భారీ ఓపెనింగ్స్ రావడం విశేషం. ఈ సినిమా చూసినవాళ్లంతా 'మహానటి' ఓ 'మణిపూస' అనేస్తున్నారు. సావిత్రిగా కీర్తి సురేశ్ నటన అభినందనీయమని చెబుతున్నారు. సావిత్రి .. జెమినీ గణేశన్ లు గా కీర్తి సురేశ్ .. దుల్కర్ సల్మాన్ అదరగొట్టేశారట. ప్రేమ సన్నివేశాల్లో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని అంటున్నారు. సమంత చాలా సహజంగా నటించిందనీ .. ఏఎన్నార్ లుక్ తో కనిపించి చైతూ ఆశ్చర్యపరిచాడని చెబుతున్నారు. ఈ ఇద్దరూ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.     

  • Loading...

More Telugu News