vangaveeti ranga: రంగా హత్య కేసులో నేను ఉన్నానని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎమ్మెల్యే వెలగపూడి

  • నిరూపించలేకపోతే విజయసాయిరెడ్డి తప్పుకోవాలి
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
  • ధర్మ పోరాట దీక్ష విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు

వంగవీటి రంగా హత్య కేసులో తాను ఉన్నానని నిరూపిస్తే... రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని టీడీపీ విశాఖపట్నం తూర్పు నియోజక వర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సవాల్ విసిరారు. తనపై కేసులు ఉన్నాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలను నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి విజయసాయిరెడ్డి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, 19 విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, విశాఖలో నిర్వహించనున్న ధర్మ పోరాట దీక్ష విజయవంతం కావాలని కోరుతూ ఆయన పోలమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 

vangaveeti ranga
velagapudi ramakrishna babu
Vijay Sai Reddy
  • Loading...

More Telugu News