roja: చంద్రబాబు పాపం పండింది.. జైలుకు వెళ్లడం ఖాయం: రోజా

  • ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకు వెళతారు
  • ఇప్పటికైనా కేసు విచారణను వేగవంతం చేయాలి
  • ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటు

ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు జైలుకు వెళ్లాల్సిందేనని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఇప్పటికైనా ఈ కేసు విచారణ వేగంగా కొనసాగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. తన ప్రియ శిష్యుడు రేవంత్ రెడ్డిని చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలోకి పంపించారని... రేపొద్దున కాంగ్రెస్ అవసరం వస్తే ఉపయోగకరంగా ఉంటుందనే ఇలా చేశారని అన్నారు.

టీఆర్ఎస్ పార్టీలోకి కూడా పలువురు టీడీపీ నేతలను పంపించారని... ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అనే భావనతోనే ఇలా చేశారని దుయ్యబట్టారు. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటని, వైసీపీకి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. అమరావతికి వచ్చిన కేసీఆర్ కు 38 రకాల వంటలతో చంద్రబాబు విందు ఇచ్చారని... ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ఆయన ఇదంతా చేశారని ఆరోపించారు.

roja
Chandrababu
KCR
vote for note
  • Loading...

More Telugu News