amit shah: హంగ్ వచ్చే అవకాశమే లేదు.. 15వ తేదీ సిద్ధూకు ఆఖరి రోజు: అమిత్ షా

  • కర్ణాటకలో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
  • సిద్ధరామయ్యను కన్నడ ప్రజలు సాగనంపుతారు
  • మోదీకి మద్దతుగా ప్రజలంతా బీజేపీకి ఓటు వేయాలి

కర్ణాటకలో హంగ్ వచ్చే అవకాశమే లేదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తేల్చి చెప్పారు. పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, కర్ణాటక ప్రజలకు మధ్య జరుగుతున్నాయని అన్నారు. ఈనెల 15వ తేదీ (ఫలితాలు వెలువడే రోజు) సిద్ధరామయ్యకు చివరి రోజని... ప్రజలు ఆయనను సాగనంపుతారని చెప్పారు. దేశ అభ్యున్నతి కోసం కంకణం కట్టుకున్న ప్రధాని మోదీకి మద్దతుగా కర్ణాటక ప్రజలంతా ఓటు వేయాలని కోరారు. దక్షిణ కర్ణాటకలో పలువురు హిందువులను హత్య చేశారని, అయినా ఇంతవరకు అరెస్టులు జరగలేదని మండిపడ్డారు.

amit shah
siddaramaiah
modi
karnataka
elections
  • Loading...

More Telugu News