KCR: నీచమైన రాజకీయాలను మానుకోండి: కేసీఆర్ కు టీడీపీ నేత సూచన

  • ఏపీని నాశనం చేసే కుట్రలో భాగమే.. ఓటుకు నోటు కేసు
  • చంద్రబాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి యత్నిస్తున్నారు
  • కేసీఆర్ విజ్ఞతతో వ్యవహరించాలన్న పెంచలనాయుడు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీడీపీ ఏపీ రాష్ట్ర కాపునాడు కార్యదర్శి కంకణాల పెంచలనాయుడు విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసు పేరుతో కేసీఆర్ నీచమైన రాజకీయాలకు తెగబడుతున్నారని... అలాంటి నీచ రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు.

ఏపీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తుంటే, ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి కొందరు యత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. ఏపీని నాశనం చేయాలనే కుట్రలో భాగంగానే చంద్రబాబుపై ఓటుకు నోటు అభాండాలను వేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ విజ్ఞతతో వ్యవహరించాలని చెప్పారు. లేకపోతే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు. 

KCR
Chandrababu
vote for note
penchala naidu
  • Loading...

More Telugu News