jagan: బీజేపీతో జగన్‌కు సంబంధాలున్నాయి కానీ, పవన్ ‌కు లేవు!: సీపీఐ నారాయణ

  • బీజేపీతో జగన్ రహస్య ఒప్పందం
  • జగన్‌తో  పోలిస్తే పవన్ సెంట్ పర్సంట్ బెటర్
  • మోదీకి దమ్ముంటే ఇద్దరు సీఎంలపై కేసులు పెట్టాలి

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బీజేపీతో ఎటువంటి సంబంధాలు లేవని సీపీఐ నారాయణ తేల్చి చెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనుమానించవచ్చని, బీజేపీతో ఆయన రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. జగన్‌తో పోలిస్తే జనసేన అధినేత వందశాతం బెటరని కితాబిచ్చారు. ఈ కారణంగానే పవన్‌తో తాము సంబంధాలు పెట్టుకున్నామని వివరించారు.

 అక్రమాస్తుల కేసులో జగన్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై కేసులు పెట్టే దమ్ము ప్రధాని నరేంద్రమోదీకి ఉందా? అని నారాయణ ప్రశ్నించారు. కేసీఆర్ తెరపైకి తెచ్చిన ఫెడరల్ ఫ్రంట్‌ను లెఫ్ట్ పార్టీలు సమర్థించే ప్రశ్నే లేదని నారాయణ తేల్చి చెప్పారు.

jagan
Chandrababu
CPI Narayana
Andhra Pradesh
  • Loading...

More Telugu News