Rahul Gandhi: రాహుల్‌ గాంధీ 2019లో తానే పీఎం అన్నారు.. భారత భవిష్యత్తుపై మోదీ, అమిత్‌ షా బాధపడుతున్నారు: స్మృతి ఇరానీ

  • రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి విమర్శలు
  • తన నాయకత్వం, సమర్థతపై రాహుల్ గాంధీకే నమ్మకం లేదు
  • దేశ ప్రజలు ఎలా నమ్ముతారు?

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే తానే ప్రధానిని అవుతానేమోనని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో గెలిస్తే తానే పీఎం అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారని, దీంతో భారత ప్రజల భవిష్యత్తు ఏమైపోతుందోనని ప్రధాని మోదీ, అమిత్‌ షా బాధపడుతున్నారని ఆమె అన్నారు. తన నాయకత్వం, తన సమర్థతపై రాహుల్ గాంధీకే నమ్మకం లేదని, ఆయనను దేశ ప్రజలు ఎలా నమ్ముతారని స్మృతి ఇరానీ ప్రశ్నించారు.         

Rahul Gandhi
Narendra Modi
amith shah
BJP
smithi irani
  • Loading...

More Telugu News