Karnataka: కర్ణాటక ఎన్నికల్లో చడీచప్పుడూ లేకుండా ప్రచారం చేస్తోన్న ఆరెస్సెస్‌!

  • మరో నాలుగు రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు
  • బీజేపీ తరఫున రంగంలోకి ఆరెస్సెస్
  • భరతమాత ప్రతిష్టను పరిరక్షించుకోవాలని పిలుపు
  • అందుకోసం బీజేపీని గెలిపించాలని వ్యాఖ్య

మరో నాలుగు రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ తరఫున రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ ఎవరికీ తెలియనివ్వకుండా ప్రచారం మొదలుపెట్టింది. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో ఆరెస్సెస్‌ కార్యకర్తలు ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నట్లు మీడియా దృష్టికి వచ్చింది. భరత మాత ప్రతిష్టను పరిరక్షించుకోవడానికి బీజేపీని గెలిపించాలని ఆరెస్సెస్‌ డాక్యుమెంట్‌లో పేర్కొంటూ వాటిని పంచుతున్నారు.

ఒక్కో ఆరెస్సెస్‌ కార్యకర్త  విస్తృతంగా ప్రచారం చేయాలని, కాంగ్రెస్, ఇతర పార్టీలు హిందూ మతాన్ని, హిందూ నాయకులను మంట కలిపేందుకు ప్రయత్నిస్తున్నాయని డాక్యుమెంట్‌లో పేర్కొని దాన్ని ప్రచారం చేస్తున్నారు. ముస్లిం, క్రైస్తవుల ప్రయోజనాల కోసమే కాంగ్రెస్, తదితర పార్టీలు పాటుపడుతున్నాయని అటువంటి పార్టీలకు ఓటు వేయవద్దని ఆరెస్సెస్‌ కార్యకర్తలు చెబుతున్నట్లు మీడియా దృష్టికి వచ్చింది. ఆరెస్సెస్‌ రూపొందించిన డాక్యుమెంట్‌లో ఎన్నికల ప్రచారం కోసం కో ఆర్డినేటర్‌లుగా ఎవరెవరిని నియమించారో ఆ వివరాలు కూడా ఉన్నాయి. 

  • Loading...

More Telugu News