akash: పవన్ కల్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి .. ఆయన వల్లనే ఈ స్థాయిలో వున్నాం: ఆకాశ్

  • పవన్ కల్యాణ్ అంటే ఎంతో ఇష్టం 
  • మా నాన్నకి ఫస్టు ఛాన్స్ ఇచ్చారు 
  • అందుకు ఆయనకి కృతజ్ఞతలు

పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ .. 'మెహబూబా'తో హీరోగా తనని తాను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఉండగా, పవన్ కల్యాణ్ ప్రస్తావన వచ్చింది.

అప్పుడాయన స్పందిస్తూ .. "పవన్ కల్యాణ్  గారు అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నను నమ్మి ఆయన ఫస్టు ఛాన్స్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి .. ఎందుకంటే, మేం ఈ రోజున ఇలా ఉన్నామంటే అందుకు కారణం ఆయనే. 'బద్రి' సినిమా ఆయన చేయడం వల్లనే అంతటి క్రేజ్ వచ్చింది .. మరో హీరో చేస్తే అంత క్రేజ్ రాకపోయి వుండొచ్చునేమో. ఇక 'ఏ స్టార్ హీరోతోకలిసి నటించాలని వుంది?' అనే ప్రశ్నకి ఆయన స్పందిస్తూ .. 'స్టార్ హీరోల స్థాయికి వాళ్లు వచ్చారంటే ఎంతో కష్టపడి వుంటారు. ముందుగా నేను అలాంటి హీరోలతో కలిసి నటించే అర్హతను సంపాదించుకోవాలి' అన్నాడు. 

akash
pavan kalyan
  • Loading...

More Telugu News