Pawan Kalyan: నేను పవన్ కల్యాణ్ అభిమానినే.. ఈ కారణం వల్లే బీజేపీలో చేరా: సినీనటి మాధవీలత

  • బీజేపీ సిద్ధాంతాలు నచ్చాయి
  • రెండు రాష్ట్రాల్లో ఎక్కడ పోటీ చేయమన్నా చేస్తా
  • జాతీయ స్థాయిలో పని చేయాలనే కోరిక ఉంది

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే తనకు ఎంతో అభిమానమని సినీనటి మాధవీలత చెప్పింది. కానీ, బీజేపీ సిద్ధాంతాలు నచ్చే తాను ఆ పార్టీలో చేరానని తెలిపింది. తనను ఎక్కడ ప్రచారం చేయమన్నా చేస్తానని చెప్పింది. ఏపీ, తెలంగాణల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో పని చేయాలనే కోరిక ఉందని తెలిపింది. రెండు రాష్ట్రాల్లో ఎక్కడ పోటీ చేయమన్నా చేస్తానని చెప్పింది. తనకు ప్రాంతీయ భేదాలు లేవని... తన కుటుంబంలో చాలామంది ఆర్మీలో ఉన్నారని తెలిపింది. సినీ ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పింది.

ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నోసార్లు మాట మార్చారని విమర్శించింది. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఏపీకి భారీ ఎత్తున నిధులు ఇచ్చిందని తెలిపింది. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించింది. పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని... లారీ ఇసుక ఎత్తితే రూ. 5 లక్షలు బిల్లు పెట్టారని ఆరోపించింది.

Pawan Kalyan
madhavi latha
Chandrababu
BJP
polavaram
  • Loading...

More Telugu News