snake: పాముకి ఆపరేషన్ చేసి.. దాని ప్రాణాలు కాపాడిన వైనం!

  • జంగారెడ్డి గూడెంలో ఘటన
  • ఓ ఇంట్లో దూరిన పాము
  • కర్రతో కొట్టిన స్థానికులు
  • రక్షించిన స్నేక్ సేవర్ సొసైటీ

పాముకి ఆపరేషన్‌ చేసి దాని ప్రాణాలు కాపాడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకుంది. ఆ గ్రామంలో ఆరు అడుగుల పొడవైన తాచు పాము ఓ ఇంట్లో దూరగా ఈ విషయాన్ని గుర్తించిన ఇంట్లోని వారు వెంటనే స్నేక్ సేవర్ సొసైటీకి ఫోన్ చేశారు. మరోవైపు పాము ఇంట్లోంచి బయటకు వచ్చి అటూ ఇటూ తిరగసాగింది. దీంతో ఆ పాము కరుస్తుందేమోనన్న భయంతో స్థానికులు దాన్ని కర్రతో కొట్టారు.

అంతలో  స్నేక్ సేవర్ సొసైటీ టీమ్‌ అక్కడకు చేరుకుంది. ఆ పామును చంపొద్దని చెప్పి దాన్ని తీసుకుని పశువైద్యుడు రామసోమేశ్వరావు దగ్గరకు తీసుకెళ్లారు. దీంతో డాక్టర్లు దానికి కుట్లు వేసి శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడి, పది రోజుల్లో ఆ పాము కోలుకుంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News