Mahesh Babu: తమిళనాట 'భరత్' అదరగొట్టేశాడు

  • కొరటాల దర్శకత్వంలో 'భరత్ అనే నేను'
  • మహేశ్ సరసన కైరా అద్వాని 
  • తమిళనాట భారీ వసూళ్లు

కొరటాల శివ .. మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన 'భరత్ అనే నేను' విడుదలైన ప్రతి ప్రాంతంలోను భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తమిళనాట తెలుగు వెర్షన్ కి అనూహ్యమైన ఆదరణ లభించడం మరో విశేషం.

తెలుగు వెర్షన్ అక్కడ 4.2 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం చెప్పుకోదగిన విషయం. తెలుగు వెర్షన్ లో ఇంతవరకూ ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా ఇదేనని అంటున్నారు. ఈ సినిమాతో అక్కడ మహేశ్ బాబు క్రేజ్ మరింతగా పెరిగిపోయిందనీ, భవిష్యత్తులో అక్కడ ఆయన సినిమాలు ఇతర హీరోల సినిమాలకి గట్టిపోటీ ఇస్తాయనడంలో సందేహం లేదని చెప్పుకుంటున్నారు. 'స్పైడర్'తో గట్టిగా ప్రయత్నించిన మహేశ్ బాబు, ఈ సినిమాతో తమిళంలో తన మార్కెట్ ను పెంచుకోవడంలో సక్సెస్ అయ్యాడని చెప్పుకుంటున్నారు. 

  • Loading...

More Telugu News