chaman: అధికార లాంఛనాలతో చమన్ అంత్యక్రియలు పూర్తి

  • రామగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో అంత్యక్రియలు
  • హాజరైన పరిటాల సునీత, దేవినేని ఉమ, పలువురు ఎమ్మెల్యేలు
  • భారీగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు

పరిటాల రవి ముఖ్య అనుచరుడు, అనంతపురం జిల్లాపరిషత్ మాజీ ఛైర్మన్ చమన్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. రామగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో గల చమన్ వ్యవసాయ భూమిలో అంత్యక్రియలను నిర్వహించారు. అంత్యక్రియలకు పరిటాల రవి కుటుంబసభ్యులతో పాటు భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు.

రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, వరదాపురం సూరి, బీకే పార్థసారథి, ఎంపీ నిమ్మల కిష్టప్ప అంత్యక్రియల్లో పాల్గొన్నారు. నిన్న ఉదయం గుండెపోటుకు గురైన చమన్ అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

chaman
funerals
paritala sunitha
devineni Uma
  • Loading...

More Telugu News