keerthi suresh: జయలలిత బయోపిక్ లోను కీర్తి సురేశ్?

  • 'మహానటి'గా కీర్తి సురేశ్ 
  • త్వరలో మరో తమిళ బయోపిక్ 
  • అందరిలో పెరుగుతోన్న ఆసక్తి     

తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా కీర్తి సురేశ్ కి ఎంతో క్రేజ్ వుంది. ఈ రెండు భాషల్లోని స్టార్ హీరోల సరసన ఆమెకి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఆమె ప్రధానమైన పాత్రను పోషించిన 'మహానటి' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో జయలలిత బయోపిక్ లోను కీర్తి సురేశ్ నటించే అవకాశాలు వున్నాయంటూ ఒక టాక్ వినిపిస్తోంది.

త్వరలో తాను తమిళంలో ఒక భారీ బయోపిక్ లో నటించనున్నాననీ, ఆ వివరాలను కొన్ని రోజుల్లో తెలియజేస్తానని కీర్తి సురేశ్ తాజా ఇంటర్వ్యూలో అంది. అది జయలలిత బయోపిక్ అయ్యుంటుందనే ఊహాగానాలు బలం పుంజుకున్నాయి. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనున్నట్టు సమాచారం. జయలలిత జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన కోణాలు వున్నాయి. అందువలన ఆమె బయోపిక్ సంచలనానికి తెరదీయడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. 

  • Loading...

More Telugu News