Sonia Gandhi: సోనియా గాంధీ అసలు పేరు తెలుసా?... కర్ణాటక ఎన్నికల వేళ వైరల్ చేస్తున్న బీజేపీ!

  • ఇటలీ నుంచి వచ్చిన సోనియా
  • రాజీవ్ గాంధీతో ప్రేమ వివాహం
  • ఆమె అసలు పేరు ఆంటోనియో మైనో
  • సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న బీజేపీ

సోనియాగాంధీ... మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి కోడలిగా, మరో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి భార్యగా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తల్లిగానే అత్యధిక భారతీయులకు తెలుసు. ఇదే సమయంలో ఆమె ఇటలీకి చెందిన వారని, రాజీవ్ ప్రేమ వివాహం చేసుకున్నారని చాలా మందికి తెలుసు. కానీ, ఆమె అసలు పేరు... ఎంతో మందికి తెలియదనే చెప్పాలి. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య విమర్శలు తారస్థాయికి చేరిన వేళ, సోనియా అసలు పేరును బీజేపీ తెరపైకి తెచ్చి వైరల్ చేస్తోంది.

సోనియా గాంధీ అసలు పేరు ఆంటోనియో మైనో కాగా, అదే పేరుతో ఆమెను సంబోధిస్తూ సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న చివరి కోటను కాపాడుకునేందుకు ఆంటోనియో మైనో కర్ణాటకకు వచ్చారని వ్యాఖ్యానించింది. కాగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, సన్యాసిగా మారకముందు అసలు పేరు అసయ్ బిస్త్ కాగా, ఆ పేరుతో కాంగ్రెస్ ట్వీట్లు పెట్టినందునే తాము ప్రతీకారం తీర్చుకుంటున్నామని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Sonia Gandhi
Antonio Myno
Italy
Congress
BJP
Karnataka
  • Loading...

More Telugu News