savithri: 'మహానటి'లో ప్రకాశ్ రాజ్ పాత్రను పరిచయం చేసిన నాని

  • చక్రపాణి గారు మంచి రచయిత 
  • ఆణిముత్యాల్లాంటి చిత్రాలకు ఆయన సారథి 
  • సావిత్రి ఎదుగుదలలో ఆయనది ప్రముఖమైన పాత్ర

'మహానటి' సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దాంతో తమ అభిమాన కథానాయిక జీవితాన్ని గురించి తెలుసుకోవడానికి అంతా ఆత్రుతను చూపుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన చాలా పాత్రలను పరిచయం చేశారు. తాజాగా ప్రకాశ్ రాజ్ పాత్రకి సంబంధించిన వీడియోను దిల్ రాజు ఆవిష్కరించారు.

ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ .. చక్రపాణి పాత్రను పోషించారు. చక్రపాణిగారి గురించి ఈ తరం వారికి తెలిసింది చాలా తక్కువ. అందువలన 'నాని' వాయిస్ ఓవర్ ద్వారా ఆ పాత్రను గురించి చెప్పించారు. తెలుగు సినిమాపై కథా రచయితగా .. దర్శక నిర్మాతగా చక్రపాణి తనదైన ముద్రవేశారు.

చందమామ .. విజయా కంబైన్స్ స్థాపకులలో చక్రపాణి ఒకరు. ఆయన పర్యవేక్షణలోనే ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. సావిత్రి కథానాయికగా ఎదగడంలో ఆయన కూడా ప్రముఖమైన పాత్రను పోషించారు. అలాంటి ఆయన లుక్ తో ప్రకాశ్ రాజ్ కొత్తగా కనిపిస్తున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News