terrorist: కశ్మీర్ లో టెర్రరిస్టులకు ఇక సినిమానే.. రంగంలోకి బ్లాక్ క్యాట్స్!

  • ఉగ్రవాదులను అణచివేసేందుకు రంగంలోకి ఎన్ఎస్జీ కమెండోలు
  • సరిహద్దులతో పాటు శ్రీనగర్ లో బ్లాక్ క్యాట్స్ మోహరింపు
  • ఎన్ఎస్జీ డీజీకి కేంద్ర హోం శాఖ ఆదేశాలు

కశ్మీర్ లో ఉగ్రవాదుల పీచమణిచేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (బ్లాక్ క్యాట్ కమెండోలు)ను రంగంలోకి దించేందుకు కేంద్ర హోంశాఖ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేసేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన కమెండోలు సరిహద్దుల్లో మోహరించనున్నారు.

 దీనికి తోడు శ్రీనగర్ లో భద్రత కోసం కూడా బ్లాక్ క్యాట్స్ రంగంలోకి దిగనున్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గూబా ఆదేశాలు జారీ చేశారు. జమ్ముకశ్మీర్ పోలీసులతో కలసి కమెండోలు విధులు నిర్వహించాలని నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ డైరెక్టర్ జనరల్ సుదీప్ లక్టాకియాకు రాజీవ్ గూబా సూచించారు. ఎన్ఎస్జీ విభాగంలో పదివేల మంది గార్డులు ఉన్నారు. మెరుపుదాడులు చేయడంలో వీరు సిద్ధహస్తులు.

terrorist
activities
nsg
black cats
commendos
Jammu And Kashmir
  • Loading...

More Telugu News