Vijayanagaram District: శివను విడిచి ఉండలేకనే భర్త హత్యకు ప్లాన్: పోలీసుల విచారణలో నవవధువు సరస్వతి

  • పెళ్లి ఇష్టం లేదన్నా చేశారు
  • భర్త శంకర్ రావు మంచివాడే
  • ప్రియుడి కోసమే దారుణం

పెళ్లయిన పది రోజులకే భర్త హత్యకు కుట్ర చేసి గంటల వ్యవధిలోనే పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన సరస్వతి, విచారణలో మరిన్ని వివరాలను వెల్లడించగా, ఆమె ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, మరిన్ని ఆధారాల కోసం ఆమె కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. కాగా, పెళ్లి ముందే శివ తనకు పరిచయమని అంగీకరించిన సరస్వతి, తన మాట పట్టించుకోకుండా మేనబావతో వివాహం నిశ్చయించారని ఆరోపించింది.

ఆ పెళ్లి ఇష్టం లేదని చెబుతున్నా, బలవంతంగా చేశారని చెప్పింది. తన భర్త శంకర్ రావు పవర్ ప్లాంట్ లో పనిచేస్తుంటాడని, మంచి వ్యక్తేనని తనను బాగా చూసుకున్నాడని అంగీకరిస్తూనే, శివను విడిచి ఉండలేక ఈ పని చేశానని విలపించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. విజయనగరం జిల్లా పార్వతీపురం తోటపల్లి బ్యారేజ్ సమీపంలో శంకర్ రావు, సరస్వతి బైక్ పై వస్తుండగా, ముగ్గురు దాడి చేసిన ఘటన తెలిసిందే. ఈ కేసు వెనుక కుట్రదారు సరస్వతేనని తెలిసి పోలీసులే విస్తుపోయారు.

Vijayanagaram District
Murder
Lover
Plan
Marriage
  • Loading...

More Telugu News