akash: సెన్సార్ పూర్తి చేసుకున్న 'మెహబూబా'

  • ఆకాశ్ పూరీ హీరోగా 'మెహబూబా'
  • కథానాయికగా నేహా శెట్టి
  • ఈ నెల 11వ తేదీన విడుదల

కథను ఆసక్తికరంగా తయారు చేసుకోవడం లోను .. కథనాన్ని పట్టుగా నడిపించడంలోను పూరీ జగన్నాథ్ సిద్ధహస్తుడు. అలాంటి పూరీ జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ తో 'మెహబూబా' సినిమాని రూపొందించాడు. ఒక వైపున పూర్వజన్మతోను .. మరో వైపున యుద్ధం నేపథ్యంతోను ముడిపడిన కథ ఇది.

ఈ సినిమాకి దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా పూరీ వ్యవహరించాడు. ఈ నెల 11వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. ఈ విషయాన్ని చార్మీ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఆకాశ్ జోడీగా నేహా శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమా, యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. ఈ సినిమాతో తండ్రీ కొడుకులకు ఒకేసారి హిట్ పడుతుందేమో చూడాలి.  

akash
neha shetty
  • Error fetching data: Network response was not ok

More Telugu News