s gopal reddy: అనుమానాస్పద రీతిలో మరణించిన నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి కుమారుడు.. సముద్రంలో కొట్టుకు వచ్చిన మృతదేహం

  • నెల్లూరు జిల్లా వాకాడు మండలం పంబలి వద్ద ఘటన
  • భార్గవ్ వయసు 47 సంవత్సరాలు
  • పలు హిట్ చిత్రాలను నిర్మించిన గోపాల్ రెడ్డి

ప్రముఖ సినీ నిర్మాత, భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అధినేత ఎస్.గోపాల్ రెడ్డి కుమారుడు భార్గవ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సముద్రంలో ఆయన మృతదేహం కొట్టుకువచ్చింది. భార్గవ్ వయసు 47 సంవత్సరాలు. నెల్లూరు జిల్లా వాకాడు మండలం పంబలి వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

మరోవైపు, ఒక కుక్క పిల్లను కాపాడేందుకు వెళ్లి సముద్రంలో పడి ఆయన మరణించినట్టు కొందరు చెబుతున్నారు. భార్గవ్ ఆర్ట్స్ పేరుతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను గోపాల్ రెడ్డి నిర్మించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

s gopal reddy
bhargav
son
died
tollywood
producer
  • Loading...

More Telugu News