Chandrababu: చమన్ కుటుంబానికి ఓదార్పు .. చమన్ చిరకాల వాంఛ తీరుస్తానని చంద్రబాబు హామీ!

  • చమన్ భార్య రమేజాబీకు ఫోన్ చేసిన చంద్రబాబు
  • అండగా ఉంటామని హామీ
  • కుమారుడిని ఎంబీబీఎస్ చదివించాలన్న చమన్ కోరిక తీరుస్తా

అనంతపురం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మాజీ మంత్రి పరిటాల రవి ప్రధాన అనుచరుడు చమన్ గుండెపోటుతో నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. చమన్ కుటుంబానికి సీఎం చంద్రబాబు సానుభూతి తెలిపారు. చమన్ భార్య రమేజాబీకు ఈరోజు ఉదయం ఆయన ఫోన్ చేసి మాట్లాడి ఓదార్చారు. చమన్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. తన కుమారుడు ఉమర్ ముక్తాను ఎంబీబీఎస్ చదివించాలనేది చమన్ చిరకాల వాంఛ అని, ఆ బాధ్యతను తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాగా, చమన్ అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం ఆయన స్వగ్రామంలో జరగనున్నాయి.

Chandrababu
chaman
  • Loading...

More Telugu News